close

తాజా వార్తలు

Published : 23/05/2020 21:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తక్షణ నగదు కోసం ‘నేతన్నకు చేయూత’:కేటీఆర్‌

హైదరాబాద్: కరోనా కాలంలో నేతన్నలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ఐఐసీ కేంద్ర కార్యాలయంలో చేనేత శాఖ, వరంగల్‌ టెక్స్‌టైల్స్‌ పార్క్‌, ఫార్మా సిటీ పనుల పురోగతి, తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ప్రతినిధులతో కేటీఆర్‌ సమీక్షించారు. బతుకమ్మ చీరల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏరోస్పేస్‌ డిఫెన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖలోని విభాగాల వారీగా మంత్రి సమీక్షించారు. చేనేత కార్మికులకు తక్షణమే నగదు అందుబాటులోకి వచ్చేలా ‘నేతన్నకు చేయూత’ పథకం కింద సాయం అందిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు. తద్వారా 26,500 మంది నేతన్నలు తక్షణ ఉపశమనం పొందుతారని చెప్పారు. ఈ పథకంలో భాగస్వామ్యులైన వారికి రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు నగదు అందుతుందన్నారు. సొసైటీల పరిధిలో మరో రూ. 1.18 కోట్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని నేతన్నలకు అండగా నిలుస్తూ వారి ఉత్పత్తులకు డిమాండ్ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని కేటీఆర్ తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన