close

తాజా వార్తలు

Published : 16/06/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లైన 3 రోజులకి వరుడికి పాజిటివ్‌

పాల్ఘర్‌: వరుడుకి కరోనా పాజిటివ్‌ రావడంతో వధువు, పెళ్లికి హాజరైన 63 మంది బంధువులు క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే పెళ్లికి ముందు వరుడికి కరోనా పరీక్ష చేయగా నెగిటివ్‌ అని వచ్చింది. అనంతరం పెళ్లి అయిన మూడు రోజులకి మరోసారి పరీక్షలు నిర్వహించగా మహమ్మారి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వధువు, బంధువులని క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. పాల్ఘర్‌లో ఇప్పటివరకు 1,911 మందికి కరోనా బారిన పడగా 61 మంది మరణించారు. మరోవైపు మహారాష్ట్రలో కొవిడ్‌-19 విజృంభిస్తోంది. ఇప్పటివరకు 1,07,958 మందికి వైరస్‌ సోకగా 3950 మంది మృతిచెందారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని