విజయవాడ గ్యాంగ్‌వార్‌లో గాయపడిన వ్యక్తి మృతి
close

తాజా వార్తలు

Published : 01/06/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడ గ్యాంగ్‌వార్‌లో గాయపడిన వ్యక్తి మృతి

విజయవాడ: విజయవాడ పటమటలో కలకలం సృష్టించిన గ్యాంగ్‌వార్‌లో ఒకరు మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌ విషయంలో మణికంఠ, తోట సందీప్‌ మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన సందీప్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సందీప్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘర్షణలో గాయపడినవారిలో మరికొంత మంది ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సుమారు 40 మంది ఈ దాడిలో పాల్గొన్నారని.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిన్న విజయవాడ పటమటలో కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుని యువకులు వీరంగం సృష్టించారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తడంతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ వివాదంలో మాజీ రౌడీషీటర్‌ ఒకరు జోక్యం చేసుకున్నారని స్థానికులు తెలిపారు. ఇరు వర్గాలు కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని