close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120025367 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => NypGoRp_yXQ [video_short_link] => NypGoRp_yXQ [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-22 14:58:15.835355 [display_status] => 1 [video_isdeleted] => ) [1] => stdClass Object ( [video_news_id] => 120025367 [video_srlno] => 2 [video_type] => 1 [video_link] => 066ryOLXMbo [video_short_link] => 066ryOLXMbo [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-22 14:58:15.899848 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

సుప్రీం తీర్పులకు విశేష స్పందన: మోదీ

దిల్లీ: దేశంలో సంక్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ ఎంతగానో కృషిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలోని సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. వ్యవస్థలో మార్పులు హేతుబద్ధంగా, చట్టపరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. 

నేడు 130 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థల ద్వారానే పరిష్కరించుకుంటున్నారని మోదీ అన్నారు. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఆ తీర్పులను ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ముమ్మారు తలాక్‌, మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు, దివ్యాంగుల హక్కులపై సుప్రీం ఇచ్చిన తీర్పులను ప్రశంసించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు న్యాయవ్యవస్థ సముచిత న్యాయం చేస్తోందని కొనియాడారు. ప్రస్తుతం డేటా భద్రత, సైబర్‌ నేరాల వంటి సమస్యలు న్యాయవ్యవస్థకు కొత్త సవాలుగా నిలిచాయని, వీటి పరిష్కారానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.  

ఈ సందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ విలువలు, ఆదర్శాలను మరోసారి గుర్తుచేశారు. మహాత్మాగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారని, ఆయన ఆచరించిన మార్గంతో న్యాయవ్యవస్థకు పునాది వేశారని కొనియాడారు. న్యాయవాది అయిన గాంధీజీ.. తన ఆత్మకథలో ఆయన జీవితంలో పోరాడిన మొదటి దావా గురించి రాసుకొచ్చారని చెప్పారు. 70ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థలో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించామని, అతివలకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్‌ ఒకటని చెప్పారు. 

అవినీతిపరులకు ఆ హక్కు లేదు: కేంద్రమంత్రి

అంతకుముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ప్రసంగించారు. ఉగ్రవాదులు, అవినీతిపరులకు వ్యక్తిగత గోప్యత హక్కు లేదని కేంద్రమంత్రి అన్నారు. అలాంటి వ్యక్తులు వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని ఎన్నటికీ అనుమతించబోమని తెలిపారు. చట్టం స్థిరసూత్రాలను ప్రజలు ఉల్లంఘించకూడదని సూచించారు. 

భారత్‌ విభిన్న సంస్కృతుల సమ్మేళనం: చీఫ్‌ జస్టిస్‌

ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే మాట్లాడుతూ.. ‘మన దేశ రాజ్యాంగం ఒక దృఢమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థను సృష్టించింది. దాని ప్రాథమిక లక్షణాలను చెక్కుచెదరకుండా ఉంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. భారత్‌ విభిన్న సంస్కృతుల సమ్మేళనం. న్యాయవ్యవస్థ, సంస్థలకు కూడా ఇదే వర్తిస్తుంది. అన్ని నాగరికతలకు సంబంధించిన చట్టపరమైన సంస్కృతులను మేం సమీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. 

 




Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.