ఫొటో ఓటర్ల జాబితా సవరణ ఈసీ అవకాశం
close

తాజా వార్తలు

Updated : 10/08/2020 16:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫొటో ఓటర్ల జాబితా సవరణ ఈసీ అవకాశం

అమరావతి: ఏపీలో ఫొటో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణకు నిర్ధిష్టమైన గడువును ఖరారుచేసింది. 2021 జనవరి 1 నాటికి సవరించిన ఫొటో ఓటర్ల జాబితా ప్రకటనకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబర్‌ 31 వరకు గడువు విధించింది. సవరించిన ఓటర్ల జాబితాతో ముసాయిదాను నవంబర్‌ 16న ప్రకటించనున్నట్టు స్పష్టంచేసింది. అభ్యంతరాలు, ఫిర్యాదులకు డిసెంబర్‌ 15 వరకు సమయం ఇచ్చింది. 2021 జనవరి 15న ఫొటో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్టు ఈసీ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని