అప్పడాల వల్ల కోలుకుంటున్నారా?: సంజయ్‌ రౌత్
close

తాజా వార్తలు

Published : 17/09/2020 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పడాల వల్ల కోలుకుంటున్నారా?: సంజయ్‌ రౌత్

కరోనా కట్టడి చర్యలపై శివసేన ఎంపీ వ్యాఖ్య

దిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ రాజ్యసభలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలను గురువారం శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ తిప్పికొట్టారు. వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్యను వెల్లడించడంతో పాటు ముంబయి మురికివాడ ధారావిలో వైరస్‌ అదుపులోకి రావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలను ప్రస్తావించారు. 

‘మా అమ్మ, సోదరుడు కరోనా బారిన పడ్డారు. మహారాష్ట్రలోని చాలామంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పుడు ధారావిలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆరోగ్య సంస్థ కూడా బీఎంసీ కృషిని కొనియాడింది. కొందరు నిన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినందున ఈ వాస్తవాలను వెల్లడించాలనుకున్నాను. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి ప్రజలు ఎలా కోలుకున్నారని సభ్యులను ప్రశ్నించాలనుకుంటున్నాను. భాభీజీ అప్పడాలు తినడం వల్ల కోలుకున్నారా? ఇది రాజకీయ పోరాటం కాదు. కానీ, ప్రజల ప్రాణాలు కాపాడటానికి చేసే పోరాటం’ అంటూ సంజయ్‌ మహారాష్ట్ర ప్రభుత్వ కృషిని సమర్థించుకున్నారు. 

కొద్ది నెలల క్రితం కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్ మేఘ్‌వాల్ మాట్లాడుతూ..ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఓ సంస్థ తయారు చేస్తోన్న భాభీజీ అప్పడాలు తినడం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తరవాత సదరు మంత్రికే కరోనా సోకడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని