30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేస్తాం: సంజయ్‌
close

తాజా వార్తలు

Published : 06/10/2020 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేస్తాం: సంజయ్‌

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బరిలోకి దిగడం లాంఛనమైంది. బిహార్‌లో సమస్యలే లేవనుకుంటే.. అక్కడ ఏయే సమస్యలున్నాయో పార్సిల్‌ ద్వారా పంపిస్తామని ఇప్పటికే చెప్పిన ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌.. తాజా ఎన్నికల్లో కనీసం 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. బిహార్‌లో తాము కనీసం 50 స్థానాల్లో బరిలోకి దిగాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారని అయితే దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంజయ్‌ చెప్పారు.

బిహార్‌ మాజీ డిజీపీ గుప్తేశ్వర్‌ పాండేకి పోటీగా అభ్యర్థిని నిలబెడతారా? అని విలేకరులు ప్రశ్నించగా ‘చూస్తూ ఉండండి’ అంటూ సమాధానాన్ని దాటవేశారు. బాలీవుట్‌ నటుడు సుశాంత్‌ మృతి కేసులో పాండే సీబీఐ విచారణను ఎదుర్కొన్నప్పటి నుంచి ఆయన్ను శివసేన టార్గెట్‌  చేస్తూనే ఉంది. ఓవైపు కేసు విచారణ దశలో ఉండగానే పాండే డీజీపీ పదవికి రాజీనామా చేసి అధికార జేడీయూలో చేరారు. మరోవైపు పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీల్లో సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో అటు మహాకూటమి నుంచి వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ, ఎన్‌డీఏ నుంచి చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ బయటకు వచ్చేశాయి. ఈ క్రమంలో శివసేన కూడా బరిలోకి దిగినట్లయితే రాజకీయ సమీకరణాలు ఏవిధంగా మారుతాయో చూడాలి. బిహార్‌ ఎన్నికలు ఆక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని