close

తాజా వార్తలు

Updated : 21/10/2020 05:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్నికల సభలో తేజస్వి యాదవ్‌పైకి చెప్పులు

పట్నా‌: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఔరంగాబాద్‌ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనపైకి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం వచ్చిన తేజస్వి.. సభా వేదికపై కూర్చోగా ఆయనకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా ఆయన వైపు రెండు చెప్పులు దూసుకొచ్చాయి. వాటిలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెనక్కి వెళ్లిపోగా.. మరో చెప్పు మాత్రం ఆయన చేతులకు తగిలింది. ఈ దృశ్యం వీడియోలో రికార్డయింది.

అయితే, ఆయనపైకి ఎవరు చెప్పులు విసిరారో, ఎందుకు విసిరారో మాత్రం తెలియలేదు. ఈ ఘటన అనంతరం తన ప్రసంగం మొదలు పెట్టిన తేజస్వి మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తేజస్విపై చెప్పులు విసిరిన ఘటనను ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్‌ తివారీ ఖండించారు. ఎన్నికల బహిరంగ సభల సందర్భంలో నేతలకు సరైన భద్రతా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి ఆర్జేడీ తలపడుతోంది. మొత్తం 243 స్థానాలకు గాను ఆర్జేడీ 144 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించుతోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.