close

తాజా వార్తలు

Published : 15/07/2020 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీగా పుంజుకున్న మార్కెట్లు

ముంబయి: మంగళవారం నాటి భారీ నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. బుధవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 409 పాయింట్లు లాభపడి 36,442 వద్ద ట్రేడువుతుండగా.. నిఫ్టీ 122 పాయింట్లు ఎగబాకి 10,729 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.13 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగియడం.. ఆసియా మార్కెట్లు సైతం సానుకూలంగా కదలాడుతుండడం దేశీయ సూచీలకు కలిసొచ్చింది. విప్రో షేర్లు ఏకంగా 14 శాతం మేర లాభపడ్డాయి. అలాగే మరికొన్ని కీలక కంపెనీల షేర్లు సైతం లాభాల్లో పయనిస్తుండటం సూచీలకు దన్నుగా నిలిచింది. 

విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడగా.. భారతీ ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, ఐఓసీఎల్‌, శ్రీ సిమెంట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని