యూపీలో మరో అఘాయిత్యం
close

తాజా వార్తలు

Published : 13/10/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో మరో అఘాయిత్యం

పరీక్ష కేంద్రంలో మైనర్‌పై అత్యాచారం

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో మైనర్లు, యువతులపై దారుణాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఓ మైనర్‌ బాలికపై పరీక్ష కేంద్రంలో అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. ఆ రాష్ర్ట ప్రొవిజినల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (పీసీఎస్‌) పరీక్ష జరుగుతున్న సమయంలో మైనర్‌పై దాడికి పాల్పడిన కేసులో పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఝాన్సీలోని ఓ కళాశాలలో ఆదివారం పీసీఎస్‌ పరీక్ష జరిగింది. ఆ సమయంలో 10 మందికి పైగా తనను కళాశాలలోకి లాక్కొని వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. అందులో ఒకరు మైనర్‌పై అత్యాచారం చేశారు. తన దగ్గర ఉన్న రూ.రెండు వేలు లాక్కున్నారని, ఈ ఘటనను వీడియో తీసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పరీక్ష జరుగుతున్న సమయంలో పోలీసు సిబ్బంది తక్కువ మంది విధుల్లో ఉన్నారు. వాళ్లు కూడా పరీక్షకు సంబంధించిన పనిలో ఉండగా నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యువతి ఏడుపు విన్న విధుల్లో ఉన్న పోలీసులు బాధితురాలిని స్థానిక పోలీసుస్టేషనకు తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులు సహా ఈ ఘటనకు సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఓ సీనియర్‌ ఉన్నతాధికారి తెలిపారు. పరీక్ష జరుగుతున్న సమయంలో మైనర్‌.. కళాశాల వద్దకు ఎందుకు వచ్చారనే కోణంలో విచారిస్తున్నట్లు ఆయన వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని