
తాజా వార్తలు
టెడ్డీబేర్లతో భౌతికదూరం..!
ఇంటర్నెట్‌డెస్క్: సాధరణంగా కొత్త అవిష్కరణలు ప్రత్యేకంగా పుట్టుకురావు.. అవసరమే వాటిని సృష్టించేలా చేస్తుంది. అలాంటిదే జర్మనీలో ఒక బార్ అండ్ రెస్టారెంట్లో జరిగింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాల్సిన వేళ ఆ ఉద్దేశాన్ని తెలిపేలా జర్మనీలోని ‘బీఫ్ అండ్ బీర్’ అనే బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు టెడ్డీబేర్లతో వినూత్న ప్రయోగం చేశారు. డైనింగ్ టేబుల్ కుర్చీలపై గోధుమ వర్ణంలో ఉన్న టెడ్డీబేర్లను ఎదురెదురుగా కూర్చోబెట్టారు. వాటి పక్క టేబుల్‌పై మాత్రం కస్టమర్లకు కూర్చునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో వారు భౌతికదూరం పాటిస్తూ వారికి కావాల్సిన వైన్, ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అలాగే తమ కస్టమర్లకు సరికొత్త అనుభూతి ఇచ్చేలా ఆ టెడ్డీలు కూర్చన్న టేబుళ్లపై కూడా వైన్ బాటిల్, రెండు గ్లాసులను ఉంచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజికమాధ్యమాల ద్వారా ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అందరూ భౌతికదూరం పాటించేలా ఈ రెస్టారెంట్ టెడ్డీబేర్ల సహాయంతో వినూత్నంగా ప్రయోగం చేసిందంటూ రాసుకొచ్చాడు. వీటిన చూసిన నెటిజన్లు ఆలోచన చాలా బాగుందంటూ కితాబిస్తున్నారు. మరొకొందరు సరదాగా కామెంటు చేస్తున్నారు. ‘ఏయ్ టెడ్డీ మద్యం తాగేందుకు నీకు సరిపడా వయసు ఉందా?’, ‘ఓయ్ టెడ్డీ కొంచెం సాల్ట్ ఇస్తావా’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
