close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120042540 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => ASQNDcPWQvg [video_short_link] => ASQNDcPWQvg [created_by] => [created_date] => [modified_by] => 8924902 [modified_date] => 2020-03-29 22:03:01.168784 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా ఫ్రీ తెలంగాణ: కేసీఆర్‌

కొత్త కేసులు నమోదు కాకపోతే..

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విదేశాల నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింప చేశామని, కేంద్రం కూడా విమానాశ్రయాలు, పోర్టులన్నీ మూసివేసిందని తెలిపారు. అందువల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువని సీఎం అన్నారు. రాష్ట్రంలోనూ కొత్త కేసులు నమోదు కాకపోతే ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరని చెప్పారు.  చికిత్స పొందిన 11మంది కరోనా బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపారు. 58 మంది పరిస్థితి నిలకడగా ఉందని, వారిని కూడా పరిస్థితులను బట్టి విడతల వారీగా డిశ్చార్జి చేస్తామని వివరించారు. చికిత్స పొందుతున్న వారందరూ బాగానే కోలుకుంటున్నారని తెలిపారు. మొత్తం 25,935 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అన్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారిని 5,742 బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.

కరోనా వ్యాధిని నివారించడం పట్ల 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ తెలివిగా వ్యవహరించిందని అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అందరూ సహకరిస్తున్నారని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని కోరారు. గండం నుంచి గట్టెక్కినట్లేని ఇప్పుడే సంబరపడవద్దని సీఎం హితవు పలికారు. ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదని, అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఉన్నంతకాలం స్వీయనిర్భందంలో ఉండాలని కోరారు.

కంచెలను తొలగించాలి
 కరోనా నివారణలో భాగంగా గ్రామ సరిహద్దుల్లో గ్రామస్థులు ఏర్పాటు చేసిన కంచెలను తొలగించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. కంచెలు వేసినచోటే గంగాలం, నీళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా రాకుండా జాగ్రత్తపడటం మంచిదేనని, అయితే పట్టు విడుపులతో కంచెలు తొలగించకపోతే సమస్యలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు రావొద్దని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్రంలో 14.50 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి రైతుల చేతికి రావాల్సి ఉందని, మొక్క జొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ చెప్పారు. ‘‘ మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు. అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చాం. మరోవైపు వరి..కోటి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ మార్కెట్లన్నీ తాత్కాలికంగా మూసివేశాం. రైతులకు టోకెన్లు జారీ చేసి విడతల వారీగా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులంతా క్రమశిక్షణతో ప్రభుత్వానికి సహకరించాలి. ఒకేరోజు అందరి ధాన్యం కొనుగోలు సాధ్యం కాదు. అందువల్ల టోకెన్‌పై ఉన్న తేదీ ప్రకారమే రైతులు ధాన్యం అమ్మకానికి రావాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఉద్యోగులకు జీతాలివ్వడమే సమస్యగా ఉంది
చరిత్రలో ఎన్నడూ రానంతగా వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. అయితే ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని అన్నారు. అయినప్పటికీ అప్పు తెచ్చయినా రైతుల పంటను కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడమే సమస్యగా ఉందని తెలిపారు. కఠిన పరిస్థితుల్లోనూ రూ.25 వేల కోట్లు పౌర సరఫరాల కార్పోరేషన్‌కు ఇచ్చామని సీఎం గుర్తు చేశారు.
దుష్ప్రచారం చేస్తే ఉపేక్షించం
సామాజిక మాధ్యమాలతోపాటు ఎక్కడైనా కరోనా పట్ల దుష్ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల బాధ్యతగా తీసుకొని శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. నిన్న మృతి చెందిన వ్యక్తి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న వ్యక్తి కాదని, అయినప్పటికీ అతడికి పరీక్షలు జరిపామని చెప్పారు.‘‘ కరోనా విషయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా సమాచారం ఇస్తున్నాం. మంత్రి ఈటల రాజేందర్‌ అన్ని విషయాలు కూలంకషంగా వివరిస్తున్నారు. ఇంత నిబద్ధతతో పని చేస్తుంటే దుష్ప్రచారాలు చేయడం క్షమార్హం కాదు’’ అని కేసీఆర్‌ అన్నారు. మరోవైపు కరీంనగర్‌లోనూ పరిస్థితులు చక్కబడ్డాయని తెలిపారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.