అదే చైనా నిజస్వరూపం: అమెరికా 
close

తాజా వార్తలు

Updated : 02/07/2020 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే చైనా నిజస్వరూపం: అమెరికా 

వాషింగ్టన్‌: భారత్‌ సహా సరిహద్దు దేశాలతో చైనా దుందుడుకు వైఖరిపై అగ్రదేశం అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. అది చైనా కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు వైట్ హౌస్‌ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్‌ఎనానీ వెల్లడించారు. గత కొద్దివారాలుగా భారత్, చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మరణించడంతో అక్కడి పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. కాగా, చైనా విస్తరణ కాంక్షను నిందిస్తూ భారత్‌కు అమెరికా మద్దతు తెలిపింది. భారత్ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించిన సంగతి తెలిసిందే. 

‘భారత్‌, చైనా సరిహద్దులో చైనా దురాక్రమణ తీరు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఆ దేశ దుందుడుకు వైఖరికి సరిగ్గా సరిపోతుందని ట్రంప్‌ విమర్శించారు. ఈ చర్యలన్నీ చైనా కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని నిర్ధారిస్తున్నాయని ఆయన అన్నారు’ అని మీడియా సమావేశంలో భాగంగా కేలీ వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై అగ్రదేశం ఇప్పటివరకు కొనసాగించిన తటస్థ వైఖరిని కాస్త తీవ్రతరం చేసిందని భారత్, యూఎస్‌ సంబంధాలను అధ్యయనం చేస్తోన్న పరిశీలకులు చెప్తున్నారు. ‘భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను మేం సునిశితంగా పరిశీలిస్తున్నాం. అధ్యక్షుడు ఈ అంశంపై దృష్టి సారించారు. బలగాలను ఉపసంహరించుకోవాలనే ఆకాంక్షను ఇరుదేశాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుత విభేదాలపై సామరస్య పరిష్కారానికి మేం మద్దుతు తెలుపుతాం’ అని కేలీ ఈ సందర్భంగా వెల్లడించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని