close

తాజా వార్తలు

Published : 29/11/2020 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తల్లికి కరోనా.. శిశువులో నిరోధకాలు!

సింగపూర్‌: కరోనా వైరస్‌ మహమ్మారికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే రోజు సమీపంలోనే ఉంది. ఐతే దీనిని గురించిన కొన్ని అంశాలు ఇప్పటికీ చిక్కుముడిగానే ఉన్నాయి. ముఖ్యంగా గర్భవతులకు కొవిడ్‌-19 సోకినప్పుడు పుట్టే శిశువు పరిస్థితి ఏంటనే విషయంపై కచ్చినమైన సమాచారం లేదు. ఈ విషయంలో కాస్త స్పష్టత లభించే ఓ సంఘటన ఇటీవల సింగపూర్‌లో చోటుచేసుకుంది. గర్భిణిగా ఉన్నప్పుడు కరోనా వైరస్‌ సోకిన ఓ మహిళకు పుట్టిన శిశువులో.. కొవిడ్‌-19 నిరోధక యాంటీబాడీలు ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. సింగపూర్‌కు చెందిన ఎంగ్‌ చాన్‌ అనే మహిళకు మార్చిలో కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలు ఉన్న ఈమె.. రెండున్నర వారాల చికిత్స అనంతరం కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. కాగా, చాన్‌ ఇటీవల ఇక్కడి నేషనల్‌ యూనివర్సిటీ ఆస్పత్రిలో ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో నవజాత శిశువుకు కరోనా లేదని తెలిసింది. అంతేకాకుండా చిన్నారిలో యాంటీబాడీలు ఉన్నట్టు వెల్లడయింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం.. కరోనా బాధితురాలి ద్వారా కడుపులోని శిశువుకు కరోనా సోకుతుందా అన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ విధంగా గర్భస్థ శిశువుకు కొవిడ్‌ సోకటం అరుదని వైద్యులు అంటున్నారు. ఇటువంటి సందర్భాల్లో గర్భాశయ ద్రవాలు, తల్లి పాలు తదితరాల్లో కొవిడ్‌ లేనట్టు పరిశోధనల్లో వెల్లడైంది. కాగా, ఆ బాబుకు కొవిడ్‌ యాంటీబాడీలు తల్లి నుంచే లభించి ఉంటాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ సంఘటనతో మాతృమూర్తి నుంచి శిశువుకు కొవిడ్‌ సోకే అంశంలో కొత్త ఆధారం లభించినట్లయింది.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని