సల్మాన్‌ గారూ.. మీ మూవీ కోసం వెయిటింగ్‌: బన్నీ
close

తాజా వార్తలు

Published : 28/04/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సల్మాన్‌ గారూ.. మీ మూవీ కోసం వెయిటింగ్‌: బన్నీ

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధే’ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ తెలిపారు. ‘డీజే’లో అల్లుఅర్జున్‌ స్టెప్పులేసిన ‘సీటీమార్‌’ను తాజాగా సల్మాన్‌ తన సినిమా ‘రాధే’ కోసం రీ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు ‘సీటీమార్‌’లో బన్నీ డ్యాన్స్‌, స్టైల్‌ తనకెంతో నచ్చిందని సల్మాన్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

కాగా, తాజాగా సల్మాన్‌ ట్వీట్‌పై అల్లు అర్జున్‌ స్పందించారు. ‘థ్యాంక్యూ సో మచ్‌ సల్మాన్‌ గారు. మీ నుంచి ప్రశంసలు అందుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది అభిమానులతో కలిసి వెండితెరపై ‘రాధే’ మేజిక్‌ చూడాలని మీకోసం సీటీమార్‌ చేయాలని అనుకుంటున్నాను. మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు’ అని బన్నీ పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన మునుపెన్నడూ చూడని విధంగా ఫుల్‌ మాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ స్పెషల్‌ వీడియో అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని