ఏపీలో ముగిసిన ‘పుర’ పోలింగ్‌
close

తాజా వార్తలు

Updated : 10/03/2021 19:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ముగిసిన ‘పుర’ పోలింగ్‌

అమరావతి: స్వల్ప ఘటనల మినహా ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 71 పురపాలికలు, 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,794 డివిజన్లు, వార్డు స్థానాల్లో 580 చోట్ల ఏకగ్రీవం కాగా మిగిలిన 2,214 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

మున్సిపాలిటీల్లో 70.66%..కార్పొరేషన్లలో 57.14%

సాయంత్రం 5గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 70.66 శాతం, కార్పొరేషన్లలో 57.14 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ శాతాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో 71.52%, విజయనగరం జిల్లాలో 74.61%, విశాఖ జిల్లాలో 74.63%, తూర్పుగోదావరిలో 75.93%, పశ్చిమగోదావరి 71.54%, కృష్ణా 75.90%, గుంటూరు 69.19%, ప్రకాశం 75.46%, నెల్లూరు 71.06%, అనంతపురం 69.77%, కర్నూలు 62.53%, కడప 71.67%, చిత్తూరు జిల్లాల 69.60 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కార్పొరేషన్లలో విజయనగరంలో 63.98%, విశాఖపట్నం 56.01%, ఏలూరు 56.33%, మచిలీపట్నం 71.14%, విజయవాడ 56.81%, గుంటూరు 57.15%, ఒంగోలు 75.52%, అనంతపురం 56.41%, కర్నూలు 49.26%, కడప 54.85%, చిత్తూరు 66.06%, తిరుపతిలో 53.44శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

రాష్ట్రంలోని మున్సిపాలిటీల వారీగా వివరాలను పరిశీలిస్తే..


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని