AP news: ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్ల ఆధారంగా పదోతరగతి ఫలితాలు

తాజా వార్తలు

Published : 02/08/2021 15:50 IST

AP news: ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్ల ఆధారంగా పదోతరగతి ఫలితాలు

అమరావతి: కరోనా వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్ల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. 2020, 2021 పదో తరగతి ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన చేయాలని గతంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా 2019-2020 ఏడాదికి పాస్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన విద్యార్థులందరికీ గ్రేడ్‌ పాయింట్లు ఇవ్వాలని కమిటీ సూచించింది. అంతర్గతంగా 50 మార్కులు చొప్పున నిర్వహించిన 3 ఫార్మెటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ఉండనున్నాయి. అయితే, ఈ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు పాస్‌ గ్రేడ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటికి ఆమోదం తెలుపుతూ పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని