IPL: మిగిలిన మ్యాచ్‌లపైనే బీసీసీఐ దృష్టి..
close

తాజా వార్తలు

Published : 28/05/2021 22:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL: మిగిలిన మ్యాచ్‌లపైనే బీసీసీఐ దృష్టి..

ఇంటర్నెట్‌డెస్క్‌: బీసీసీఐ నిర్వహించ తలపెట్టిన స్పెషల్‌ జనరల్‌ మీటింగ్‌లో.. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌పైనే ఎక్కువ దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలో శనివారం ముంబయిలో ఈ సమావేశం వర్చువల్ పద్ధతిలో జరగనుంది. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 15 మధ్య మూడు వారాల పాటు యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించాలనే విషయంపై చర్చించనున్నారు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో దేశావాళీ క్రికెట్‌ భవిష్యత్‌ కార్యాచరణపైనా చర్చించనున్నట్లు సమాచారం. కాగా, ఈ ఏడాది భారత్‌లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌పైనా సభ్యులు చర్చించే అవకాశం ఉంది.

ఎలాగైనా ప్రపంచకప్‌ను ఇక్కడే నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న బీసీసీఐ.. జూన్‌ 1న జరిగే ఐసీసీ సమావేశంలో తమ నిర్ణయాన్ని బలంగా వినిపించనుంది. ఆ మెగా ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకునే ముందు భారత్‌లో కరోనా పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరనుంది. మరోవైపు యూఏఈలో అనుకున్న తేదీల్లో ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు నిర్వహిస్తే పలు రకాల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు డైరెక్టర్‌ యాష్లీ గైల్స్‌ తమ ఆటగాళ్లను సెప్టెంబర్‌లో ఐపీఎల్‌లో ఆడించబోమని తేల్చిచెప్పాడు. ఆ సమయంలో వారికి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయని తెలిపాడు. దాంతో తమ ఆటగాళ్లను పంపే వీలులేదన్నాడు. ఈ విషయంపై రేపటి సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా ఒక స్పష్టతనిస్తారని ఓ ఫ్రాంఛైజీ అధికారి పీటీఐతో అన్నారు.

మరోవైపు గతేడాది కరోనా కారణంగా రంజీ ట్రోఫీ రద్దు చేయడంతో వందలాది మంది దేశవాళీ క్రికెటర్లు ఎంతో సతమతమయ్యారు. దాంతో బీసీసీఐ వారికి నష్టపరిహారం అందిస్తామని చెప్పినా.. ఆటగాళ్లకు ఏ లెక్కన పరిహారం అందజేయాలనే విషయంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఈ క్రమంలోనే రేపటి సమావేశంలో దీని లెక్క కూడా తేల్చే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని