‘నిన్న రాళ్ల వర్షం.. ఇవాళ కరెంటు బంద్’
close

తాజా వార్తలు

Updated : 14/04/2021 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నిన్న రాళ్ల వర్షం.. ఇవాళ కరెంటు బంద్’

సత్యవేడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

సత్యవేడు: ప్రజలు తిరుగుబాటు చేస్తే ఉన్మాదుల చిరునామా గల్లంతవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సత్యవేడులో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్థితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. సభా ప్రాంతంలో కరెంటు కట్‌ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రాళ్ల దాడి చేశారని.. ఇవాళ కరెంటు నిలిపేశారని ధ్వజమెత్తారు. తాను వెళ్లిన చోట కరెంటు కట్‌ చేయాలని ఆదేశాలిచ్చారని ఆరోపించారు. సభలో రాళ్లు వేస్తే దానికి తానే ఆధారాలు ఇవ్వాలని పోలీసులు కోరడం.. బాధితులే దొంగలను పట్టించాలనే రీతిలో ఉందని ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

‘‘ఎంతో మంది దళితులకు ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ తెదేపా. బాలయోగి, ప్రతిభా భారతికి పదవులు మేమే ఇచ్చాం. వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? ప్రత్యేక హోదా కోసం ఎంపీలను గెలిపించాలని కోరారు. తన కేసుల కోసం ఇవాళ ఎంపీలను అమ్ముకున్నారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్మి దండుకొంటున్నారు. నా పోరాటం పదవి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం. సమైక్యాంధ్ర అభివృద్ధికి విజన్‌ 2020 రూపొందించాను. నవ్యాంధ్ర అభివృద్ధికి విజన్‌ 2029 తయారు చేశాను. శ్రీసిటీలోని 180 పరిశ్రమల్లో 90 తెదేపా హయాంలోనే వచ్చాయి. రూ.4వేల కోట్లతో హీరో మోటార్స్‌ తీసుకొచ్చాం’’ అని చంద్రబాబు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని