మా నిర్ణయం సరైనదేనని రుజువైంది: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 07/04/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా నిర్ణయం సరైనదేనని రుజువైంది: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పరిషత్‌ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన స్పందించారు. వైకాపా ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని చెప్పారు. తెదేపా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైనదేనని రుజువైందన్నారు. 

కోర్టుల మార్గదర్శకాలు ధిక్కరించడం సీఎం జగన్‌ మానాలని చంద్రబాబు హితవు పలికారు. ఎస్‌ఈసీ చట్టప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని.. రబ్బర్‌ స్టాంపుగా మారకూడదన్నారు. పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఏడాది దాటిందని.. కొత్త ఓటర్లకు అవకాశమిచ్చేలా మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని