
తాజా వార్తలు
దొరస్వామిరాజుకు సినీ ప్రముఖుల నివాళి
హైదరాబాద్: గుండెపోటుతో మృతిచెందిన ప్రముఖ నిర్మాత, వీఎంసీ అధినేత దొరస్వామిరాజుకు తెలుగు చలన చిత్రపరిశ్రమ నివాళులర్పించింది. ఈ ఉదయం కేర్ ఆస్పత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దంపతులు దొరస్వామిరాజుకు పుష్పాంజలి ఘటించారు. సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు మురళీమోహన్ ఫిల్మ్ ఛాంబర్‌కు విచ్చేసి తుదివీడ్కోలు పలికారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. అనంతరం ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానంలో దొరస్వామిరాజు కుమారుడు విజయ్ కుమార్ వర్మ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
వీఎంసీ ఆర్గనైజేషన్స్ను(వీఎంసీ ప్రొడక్షన్స్, వీఎంసీ పిక్చర్స్, వీఎంసీ ఫిల్మ్స్, వీఎంసీ1 కంపెనీ, వీఎంసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, వీఎంసీ పిక్చర్ ప్యాలెస్) స్థాపించి ఎన్నో సినిమాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగా దొరస్వామి రాజు వ్యవహరించారు. టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. వాటిల్లో కిరాయిదాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అన్నమయ్య, భలే పెళ్లాం, వెంగమాంబ తదితర చిత్రాలున్నాయి. దాదాపు 750 సినిమాలకు ఆయన పంపిణీదారుగా వ్యవహరించారు. గతంలో ఆయన తితిదే బోర్డు సభ్యుడిగా, నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇవీ చదవండి..
క్యాన్సర్‌పై యోధురాలు డా. శాంత కన్నుమూత
గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య