మేడే: తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేడే: తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రమజీవులతోనే అభివృద్ధి, మానవజాతి పురోగతి సాధ్యం. దేశ, రాష్ట్రాభివృద్ధిలో కార్మికులది కీలక భాగస్వామ్యం. మే డే స్ఫూర్తితో సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. తెలంగాణలో ఆదర్శవంతమైన కార్మిక, కర్షక విధానాలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో సంపద సృష్టి, ఉపాధి కల్పన సాధ్యమవుతోంది’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.  
తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి, ప్రపంచ పురోగతికి కార్మిక సోదరీ, సోదరీమణులు బాటలు వేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ శ్లాఘించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని