భర్త అనుమానాస్పద మృతి.. భార్య ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 05:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్త అనుమానాస్పద మృతి.. భార్య ఆత్మహత్య

టంగుటూరు: ప్రకాశం జిల్లాలో భార్యాభర్తల మృతి మిస్టరీగా మారింది. జిల్లాలోని టంగుటూరు మండలంలో కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోయారు. టంగుటూరు మండల పరిధిలోని మర్లపాడులో నీటికుంటలో పడి నాగరాజు (24) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. భర్త చనిపోయాడనే విషయాన్ని తెలుసుకున్న భార్య శ్రీవల్లి (21) ఒంగోలులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన నాగరాజు, శ్రీవల్లి నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ ఒంగోలులో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం తనను వేధిస్తున్నాడంటూ నాగరాజుపై శ్రీవల్లి కేసు పెట్టింది. నాగరాజు శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని