Ts: నిబంధనలు అతిక్రమిస్తే కేసులు: డీజీపీ
close

తాజా వార్తలు

Published : 12/05/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts: నిబంధనలు అతిక్రమిస్తే కేసులు: డీజీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సీపీలు, ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ మహేందర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలన్నారు. రెండో డోసు వ్యాక్సిన్‌కు వెళ్లేవారికి, మొదటి డోసు సమాచారం చూపించిన వారికి అనుతివ్వాలన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు పాసులు జారీ చేయాలని సూచించారు.

అత్యవసర ప్రయాణాలకు సీపీలు, ఎస్పీలు ఈ-పాస్‌లు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలని సూచించారు. వివాహాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు. ఈ- పాస్‌ల కోసం https://policeportal.tspolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. లాక్ డౌన్ సడలింపు వేళల్లో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణాలకే పాస్‌లు అవసరమని చెప్పారు. అంతర్ జిల్లా లేదా అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. బయలుదేరే ప్రాంతం పరిధిలోకి కమిషనరేట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని