సుకుమార్‌- విజయ్‌ కాంబో: ఆ వార్తలు అవాస్తవం
close

తాజా వార్తలు

Published : 19/04/2021 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుకుమార్‌- విజయ్‌ కాంబో: ఆ వార్తలు అవాస్తవం

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్‌ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫాల్కన్‌ క్రియేషన్స్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి నిర్మిస్తున్నారు. గతేడాదే ఈ సినిమాను ప్రకటించినా చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దాంతో విజయ్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఉంటుందా? లేదా? అనే ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై నిర్మాత స్పందించారు.

‘దర్శకుడు సుకుమార్‌, నటుడు విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ ప్రాజెక్టు మొదలవుతుంది. కొందరు ప్రచారం చేసే అవాస్తవాల్ని నమ్మొద్దు. ధ్రువీకరించకుండా రాసే ఇలాంటి వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్లాన్‌లో, ఈ కాంబినేషన్‌లో ఎలాంటి మార్పూ ఉండదు’ అని పేర్కొంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. అనన్య నాయిక. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ‘పుష్ప’ తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని