అంత్యక్రియలు చేసింది.. ‘ఆ నలుగురు..’
close

తాజా వార్తలు

Published : 05/05/2021 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంత్యక్రియలు చేసింది.. ‘ఆ నలుగురు..’

అమరావతి: కరోనా వేళ హృదయవిదారకమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా రోగుల పట్ల వివక్ష తగదని చెబుతున్నా ప్రజల వైఖరి మారడం లేదు. సాధారణంగా మరణించినా కొవిడ్‌ భయంతో అంత్యక్రియలు చేయడానికి బంధువులు ముందుకు రావడంలేదు. మొన్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జౌన్‌పుర్‌ జిల్లాలో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సైకిల్‌ మీద తిప్పిన సంఘటన కలిచివేసింది. తాజాగా అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా, కొమరోలుకు చెందిన 40 ఏళ్ల గుప్త అనారోగ్యంతో మరణించారు. కరోనాతో చనిపోయాడని భయపడి బంధువులు, చుట్టుపక్కల వాళ్లు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. దాంతో అతని స్నేహితులే బంధువులుగా మారి పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు జరిపించారు.

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్‌ పరీక్షించగా.. 20,034 మందికి పాజిటివ్‌గా (17.3% పాజిటివిటీ) నిర్ధారణ అయింది. భారీగా పెరుగుతున్న కరోనా కేసులను తగ్గించేందుకు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని