close

తాజా వార్తలు

Published : 22/10/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆహారంతో సమస్య తగ్గుతుందా?

మా అత్తయ్యకు 63 ఏళ్లు. చాలాకాలంగా ఆమెకు మధుమేహం. కూర్చుంటే లేవలేరు. కాలు కదపలేరు. నొప్పులతో పనులు చేసుకోలేరు. ఈ సమస్యల్ని ఆహారం ద్వారా తగ్గించుకోవచ్చా?- ఓ సోదరి
చాలా ఏళ్ల నుంచి మధుమేహంతో బాధపడుతున్నవారిలో కండరాల పటుత్వం, నాడుల పనితీరు క్షీణిస్తాయి. ముఖ్యంగా మహిళల బరువులో కొవ్వు శాతమే ఎక్కువ. యుక్తవయసులో పోషకాహారం తీసుకోకపోయినా, మధ్యవయసులో ఆహార నియమాలు పాటించకపోయినా వయసు పెరుగుతుంటే కండరాలు, ఎముకలు క్షీణిస్తాయి. నాడుల పనితీరులో వేగమూ తగ్గుతుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘సార్కొపినియా’ అంటారు. ఇది సమస్యకు ఒక కారణం కావొచ్చు. అధిక వయసు, మెనోపాజ్‌వల్ల హార్మోన్లలో తేడా వచ్చినా ఇలా జరగొచ్చు.  ఇప్పటి నుంచైనా మీ అత్తగారి ఆహారంలో మార్పులు చేయాలి. ముందుగా మేలైన మాంసకృత్తులను ఆమె తీసుకునేలా చూడండి. అవసరమైతే సప్లిమెంట్స్‌ కూడా. సోయా నగ్గెట్స్‌, పాలు, పెరుగు, గుడ్లు, చేపల నుంచి ప్రొటీన్‌ లభిస్తుంది. రోజూ తీసుకునే అన్నం, చపాతీల మోతాదు తగ్గించి పప్పుదినుసులు, పాల వినియోగం పెంచాలి. ఆవిడ ఉండాల్సిన బరువు కంటే తక్కువుంటే బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టాలి. ఆ సమయంలో రక్తంలో చక్కెరస్థాయులు పెరిగితే మందులతో సరి చేయాలి. వీటితోపాటు తగిన శారీరక శ్రమ తప్పనిసరి. అప్పుడే అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సజావుగా అన్ని భాగాలకు జరుగుతుంది..Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని