close

తాజా వార్తలు

Published : 12/01/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాయామాలు మొదలుపెట్టా... ఏం తినాలి?

నా వయసు 40. ఎత్తు అయిదడుగులు. బరువు 86 కిలోలు. బరువు తగ్గేందుకు ఈ మధ్యే వ్యాయామాలు మొదలుపెట్టా. రోజులో చాలాసార్లు విపరీతంగా ఆకలిగా అనిపిస్తోంది. ఆ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మార్కెట్‌లో దొరికే ప్రొటీన్‌ షేక్‌లాంటివి తాగొచ్చా?

- ఓ సోదరి

మీరు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ బరువున్నారు. మీ ఎత్తుకు ఈ బరువు చాలా అధికం. దీనివల్ల భవిష్యత్తులో చాలారకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా బరువు తగ్గాలి. ఇప్పుడున్న బరువులో కనీసం పదిశాతం అంటే దాదాపు ఎనిమిది కిలోలు తగ్గినా కొంతమేలే. దాన్ని పెరగకుండా చూసుకోవడం మంచిది. దీర్ఘకాలంలో వ్యాయామాలు కొనసాగిస్తూ, పోషకాహారం తీసుకోండి.  
ఇలా చేయండి... సాధారణంగా కొత్తగా వ్యాయామాలు మొదలుపెట్టినప్పుడు శరీరం నుంచి శక్తి కెలొరీల రూపంలో ఖర్చవుతుంది. దాంతో ఆకలి వేస్తుంది. ఇలాంటప్పుడు తక్కువ కెలొరీలు, ఎక్కువ పోషకాలు, పీచు ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. అంటే పిండిపదార్థాలు తక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజా, కమలాపండు, దానిమ్మ, జామ పండ్లను తీసుకోవచ్చు. అలాగే ఓ గ్లాసు కొవ్వులేని పాలూ, ఆ పాలతో చేసిన పెరుగు, మజ్జిగనూ తాగొచ్చు. కొబ్బరినీళ్లూ, పలుచటి రాగి జావ, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన సూప్‌లూ తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి తీరడంతోపాటు శరీరానికి పోషకాలు లభిస్తాయి. దాంతోపాటు కెలొరీలు తక్కువగా ఉండటంతో బరువూ తగ్గుతారు.
సహజంగా ప్రొటీన్‌లు... వ్యాయామాలు చేస్తూ... బరువు తగ్గే క్రమంలో...సరైన మాంసకృత్తులు తీసుకుంటే శరీరంలోని కండ శాతం నిల్వలు తగ్గకుండా, అధికంగా ఉన్న కొవ్వునిల్వలు మాత్రం తగ్గిపోతాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే ఆహారంలో కనీసం 80 గ్రా. ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, సోయా నగ్గెట్స్‌, పప్పులు, నట్స్‌, గుడ్డు, చికెన్‌, చేపలు... వీటిని తగిన మోతాదులో తీసుకోవాలి.  వీటి నుంచి కావాల్సిన ప్రొటీన్లు సహజంగానే లభ్యమవుతాయి. వీటిని తీసుకోలేకపోతే ప్రొటీన్‌ సప్లిమెంట్స్‌ వాడొచ్చు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని