close

తాజా వార్తలు

Updated : 01/02/2020 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్ర బడ్జెట్‌లో అన్నదాతకు వరాలు

దిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు.
* రైతులకు 20లక్షల సోలార్‌ పంపుసెట్లు.
* బీడు భూముల్లో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం.
*రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి.
* భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణలు
* రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం. గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు ద్వారా రుణం.
*  పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం.
* వర్షాభావ జిల్లాలకు అదనంగా నిధులు. సాగునీటి సౌకర్యం.
* ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్‌ఎస్‌జీలకు సాయం. 
* కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్‌ యోజన.
* కూరగాయలు, పండ్లు, పూల ఎగుమతులు, రవాణాకు ప్రత్యేక విమానాల వినియోగం.
* ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం. ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు.
కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపు.
*పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి.
* రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15లక్షల కోట్లు.
* 3,400 సాగర్‌ మిత్రల ఏర్పాటు
* గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు.
* ఆల్గే, సీవీ కేజ్‌ కల్చర్‌ విధానంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు.
* కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలో మరింత ఉపాధి కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.