close

తాజా వార్తలు

Updated : 14/02/2020 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌కు నిర్మలా సీతారామన్‌

న్యూదిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండురోజుల పాటు హైదరాబాద్‌, బెంగళూరులో పర్యటించనున్నారు. ఆమె పర్యటనకు ఈ నెల 16, 17 తేదీలను ఖరారు చేశారు. బడ్జెట్‌లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. ‘‘ఆర్థిక మంత్రి ఈ నెల 16,17 తేదీల్లో అధికారికంగా హైదరాబాద్‌, బెంగళూరుల్లో పర్యటించనున్నారు. బడ్జెట్‌లోని వివిధ రంగాల భాగస్వాములతో ఈ సందర్భంగా ఆమె భేటీ కానున్నారు’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో వెల్లడించింది.

ఈ రెండు నగరాల్లో తొలుత ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. ఇక రెండో సెషన్‌లో ఆర్థిక వేత్తలు, పన్ను ప్రాక్టిషనర్లు, విద్యావంతులు, విధాన కర్తలతో భేటీ కానున్నారు.  
ఈ నెల 1వ తేదీన సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఈ బడ్జెట్‌ ప్రసంగమే అత్యంత సుదీర్ఘమైంది. దీనిలో ముఖ్యంగా వ్యవసాయం, నీటిపారుదల, నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య రంగం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.