ఐఫోన్ల ఉత్పత్తిపై కరోనా ప్రభావం..
close

తాజా వార్తలు

Published : 18/02/2020 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐఫోన్ల ఉత్పత్తిపై కరోనా ప్రభావం..

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్ ప్రభావం యాపిల్‌ సంస్థపై పడింది. ఐఫోన్‌ల ఉత్పత్తి తగ్గిందని.. రెండో త్రైమాసికంలో నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను అందుకోలేమని సంస్థ వెల్లడించింది. మార్చితో ముగిసే త్రైమాసికానికి 63-67 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని సంస్థ గతంలో అంచనా వేసింది. వైరస్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్సు వెలుపల ఉన్నటువంటి యాపిల్‌ ఉత్పత్తి కేంద్రాలను తెరిచినట్లు పేర్కొంది. కానీ, తయారీ నెమ్మదిగా పెరుగుతోందని వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ అమ్మకాలపై తాత్కాలిక ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. తయారీ కేంద్రాల్లో పనిచేసే వారి ఆరోగ్యం, సంక్షేమమే తమకు ముఖ్యమని సంస్థ పేర్కొంది. పరిస్థితులపై తమ ఉత్పత్తుల సరఫరాదారులు, వైద్య నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు వైరస్‌ ప్రభావంతో చైనాలో ఐఫోన్‌ డిమాండ్‌ కూడా తగ్గినట్లు యాపిల్‌ వివరించింది. చైనాలోని 42 యాపిల్ స్టోర్లలో చాలా వరకు మూతపడగా.. కొన్ని రోజుల్లో కొద్ది గంటలు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. అమెరికా, ఐరోపా తర్వాత యాపిల్‌కు చైనా మూడో అతిపెద్ద మార్కెట్‌.

ఇప్పటికే మరికొన్ని మొబైల్‌ తయారీ సంస్థలు సైతం తమ ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. షామీ ఇప్పటికే తమ మార్చి నాటి లక్ష్యాలకు కోత పెట్టుకుంది. హువావే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ తయారీ కేంద్రాల మూత వల్ల సంస్థ పనితీరుపై ప్రభావం పడుతున్నట్లు సమాచారం. మరోవైపు శాంసంగ్‌ ఇటీవల చైనా మార్కెట్‌ నుంచి గణనీయంగా తప్పుకున్న నేపథ్యంలో ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే వైరస్ ప్రభావం ఇలాగే కొనసాగితే మాత్రం ముప్పు తప్పదని సరఫరాదారులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శాంసంగ్‌ చాలా వరకు విడిభాగాల్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని