close
Array ( ) 1

తాజా వార్తలు

పదోన్నతి వదిలి పది మందికీ ఉపాధి

అందరిలా సామాన్య ఉద్యోగిగానే తన జీవితాన్ని మొదలు పెట్టారామె. కానీ ఇప్పుడామె అందరిలో ఒకరిగా మిగిలిపోలేదు.   ఎందరికో ఆదర్శం తన ప్రస్థానం. సామాజికంగా, ఆర్థికంగా ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ  తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. సంకల్పంతో వ్యాపారం మొదలుపెట్టి పదిమందికీ ఉపాధిమార్గం చూపారు. పురుషులకే కష్టమైన నిర్మాణ రంగంలో తనేంటో నిరూపించుకొని తల ఎత్తుకొని నిలబడ్డారు హైదరాబాద్‌కు చెందిన తయ్యబా.

లుగురూ నడిచిన దారిలో నడవడం.. తలవంచుకుని బతకడం.. రాజీపడి జీవించడం తెలియని మహిళా పారిశ్రామికవేత్త తయ్యబా. 2005లో ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ మార్కెటింగ్‌ పట్టా అందుకున్న తయ్యబా ఒక బహుళ జాతి సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లింది. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం ఇస్తామన్నారు. తయ్యబా ఒప్పుకోలేదు. మేనేజర్‌ ఉద్యోగం ఇస్తేనే చేస్తానని నేరుగా చెప్పింది. ఇంటర్వ్యూ నిర్వహించిన మేనేజర్‌ ఆశ్చర్యపోయాడు. నా దగ్గరికే వచ్చి నా ఉద్యోగమే అడుగుతున్నావా? అని ప్రశ్నించాడు. సీనియారిటీ వచ్చాక చూద్దాంలే అని వెటకారంగా మాట్లాడాడు. అతడి ప్రవర్తనతో నొచ్చుకున్న తయ్యబా... దాన్ని సవాల్‌గా స్వీకరించింది. తన తెలివి తేటలు.. పనితీరుతో మిగతా ఉద్యోగులందరినీ దాటేసింది. ఏడాదిలోపే మార్కెటింగ్‌ హెడ్‌గా పదోన్నతి సాధించింది. జీతం నెలకు రూ.1.50 లక్షలు. ఈ ప్రమోషన్‌ లేఖను మేనేజర్‌ ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె ఇంకో లేఖను అతని చేతిలో పెట్టింది. అది తయ్యబా రాజీనామా లేఖ. ఈసారి మేనేజర్‌తో పాటు అక్కడున్న ఉద్యోగులంతా షాకయ్యారు. కోరుకున్న ఉద్యోగం వచ్చాక ఎందుకు రాజీనామా చేస్తున్నావంటూ మేనేజర్‌ అడగ్గా.. ‘‘నా సామర్థ్యం గురించి నాకు తెలుసు. మీఅందరికీ తెలియాలనే ఇక్కడ పనిచేశా. నా గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. అది చాలు. ఇక సెలవు’’ అంటూ తయ్యబా అక్కడి నుంచి వెళ్లిపోయింది.


ఇటుకల సోపానాలు

య్యబా అంటే... సంతోషం, బాగు అని అర్థాలున్నాయి. పేరుకు తగ్గట్లే సంతోషంగా ఉంటూ... నలుగురి బాగు కోసం పనిచేయాలనుకుందామె. ఉద్యోగం వదిలేశాక సొంతకాళ్లపై నిలబడే ప్రయత్నం చేసింది. ఇష్టమైన నిర్మాణ రంగం వైపు అడుగులు వేసింది. ముందు రియల్‌ ఎస్టేట్‌ రంగంపై అవగాహన పెంచుకుంది. హైదరాబాద్‌ శివారులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసింది. వ్యాపార నిమిత్తం 2014లో యూఏఈ వెళ్లింది. అక్కడ సిమెంట్‌ ఇటుకల వ్యాపారం విజయవంతంగా నడుస్తుండటాన్ని గుర్తించింది. అప్పటిదాకా దేశంలో ఒకేఒక్క సిమెంట్‌ ఇటుకల కంపెనీ ఉంది. వెంటనే ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేసుకున్న తయ్యబా.. బిర్లా గ్రూపును సంప్రదించింది. నిర్మాణ రంగంలో మంచి పేరున్న బిర్లా గ్రూపుతో రూ.120 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని సిమెంటు ఇటుకల వ్యాపారంలో అడుగుపెట్టింది.


ఒప్పించి.. మెప్పించా

సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టడంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించేందుకు తొలుత ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. తర్వాత అందరినీ ఒప్పించి ఫ్యాక్టరీ స్థాపించా. బిర్లా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాక సిమెంట్‌ ఇటుకలు సరఫరా చేయడానికి ఎక్కువ సమయం లేదు. పగలు, రాత్రి కష్టపడి ఆ ఒప్పందానికి న్యాయం చేశా. అప్పట్నుంచి వెనుదిరిగి చూడలేదు.


రోజుకు 20గంటలు పనిలోనే...

హైదరాబాద్‌ శివారులోని బీబీ నగర్‌లో 45 ఎకరాల స్థలంలో ప్లాంటు ఏర్పాటు చేసింది. 2016లో 70 మంది ఉద్యోగులతో పరిశ్రమ ప్రారంభించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు ఉద్యోగులకు అందుబాటులో ఉంటుంది. ఇటుకల డెలివరీ పూర్తిగా రాత్రి పూటే జరుగుతుంది. ఏమైనా సమస్యలు వస్తే ఉద్యోగులు సరిగా స్పందించరేమోనని ఆమే మేల్కోని ప్రక్రియ పూర్తి అయ్యేదాకా పర్యవేక్షిస్తుంది. డ్రైవర్‌.. కూలీ.. మేస్త్రీ ఎవరు ఫోన్‌ చేసినా అందుబాటులో ఉంటుంది. తన పనితీరుకు, మార్కెటింగ్‌ నైపుణ్యం తోడవడంతో ఇప్పుడా కంపెనీ ఎంతగానో ఎదిగింది. 350 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. టర్నోవర్‌ కోట్ల రూపాయలకు చేరుకుంది. భవన నిర్మాణ సామగ్రికి సంబంధించి తొలుత మూడు ఉత్పత్తులతో కంపెనీ మొదలుపెట్టింది. ఇప్పుడు 18 రకాల ఉత్పత్తులు విక్రయిస్తోంది. రోజుకు నాలుగు గంటలే నిద్రపోయే తయ్యబా ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తిని నింపుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.