కుప్పం వైకాపా ఇన్‌ఛార్జ్‌ కన్నుమూత
close

తాజా వార్తలు

Updated : 18/04/2020 04:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుప్పం వైకాపా ఇన్‌ఛార్జ్‌ కన్నుమూత

కుప్పం పట్టణం : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జ్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళి కన్నుమూశారు. ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళి మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమౌళి మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు.

2019 ఎన్నికలకు ముందే  చంద్రమౌళి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబుపై ఆయన పోటీ చేశారు. అనారోగ్యం కారణంగా చంద్రమౌళి తరఫున వైకాపా నేతలే నామినేషన్‌ దాఖలు చేశారు. సుమారు 30వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని