లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
close

తాజా వార్తలు

Published : 05/06/2020 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న నష్టాలతో ముగిసిన సూచీలు నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ వంటి ప్రముఖ షేర్ల మద్దతుతో పుంజుకున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు సైతం రెండు శాతం మేర లాభపడ్డాయి. ఉదయం 9:44 గంటల సమయంలో సెన్సెక్స్‌ 212 పాయింట్లు కోల్పోయి 34,193 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 75 పాయింట్లు ఎగబాకి 10,104 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.12 వద్ద కొనసాగుతోంది. 

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్‌బీఐ, హిందాల్కో ఇండస్ట్రీస్‌ కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, భారత్‌ పెట్రోలియం, ఇన్ఫోసిస్‌, వేదాంత షేర్లు నష్టాలు చివచూస్తున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని