విరాళం పేరుతో మోసం
close

తాజా వార్తలు

Published : 03/04/2020 06:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విరాళం పేరుతో మోసం

 పీఎం సహాయనిధి అంటూ అమాయకులపై కేటుగాళ్ల వల
 నకిలీ ఖాతాతో బురిడీ
 జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
ఈనాడు - హైదరాబాద్‌

సైబర్‌ నేరగాళ్లు కరోనా మహమ్మారి పేరుతోనూ సొమ్ము చేసుకొనే పనిలో పడ్డారు. కరోనా కట్టడి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా పౌరులు విరాళాలు ఇచ్చేందుకు రూపొందించిన ప్రధానమంత్రి సహాయనిధి ఖాతాకు నకిలీ తయారుచేసి అమాయకులను బురిడీ కొట్టించేందుకు సైబర్‌ దొంగలు ప్రయత్నిస్తున్నారు. ఒక అక్షరం తేడాతో వారు నకిలీ ఐడీని సృష్టించినట్లు రెండురోజుల క్రితం దిల్లీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కనిపెట్టారు. వెంటనే అప్రమత్తమై నకిలీ ఐడీని బ్లాక్‌ చేశారు. పౌరులు అందించే విరాళాల కోసం కేంద్ర ప్రభుత్వం అధికారిక యూపీఐ ఐడీ గురించి ప్రచారం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే సైబర్‌ నేరగాళ్లు నకిలీని సృష్టించి అంతర్జాలంలో ఉంచినట్లు వెల్లడైంది. ఇలాంటివి అరడజను వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా పొంచి ఉంటారు..
భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చే వారి కోసం ఎస్‌బీఐ బ్యాంకు యూపీఐ ఐడీని రూపొందించింది. అధికారిక భీమ్‌ యూపీ ఐడీ 
pmcares@sbi   ప్రస్తుతం అందుబాటులో ఉంది.
* సైబర్‌ దొంగలు
pmcares@sbi  పేరిట నకిలీ యూపీఐ ఐడీని సృష్టించారు. ఇది చూడ్డానికి అసలు ఐడీనే పోలి ఉంది. పరీక్షించి చూస్తే అధికారిక ఐడీలో ఉన్న ‘ఎస్‌’ అక్షరం ఇందులో తీసేశారు.
* విరాళాలు ఇచ్చే దాతలు ఆ ‘ఎస్‌’ అక్షరం లేకుండా నమోదు చేసి డబ్బు పంపిస్తే సైబర్‌ దొంగల పరమైపోతుంది.

సందేశాలతోనూ మోసం
ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళాలు పంపాలంటూ సైబర్‌ నేరస్థులు వేల మందికి సందేశాలు పంపిస్తూ మోసగించే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు. ఫోన్లు చేసి మరీ  మోసాలు చేస్తారని, జనం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాలను పంపాలనుకున్నవారు అధికారిక బ్యాంకు ఖాతాలకే పంపాలని సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని