భార్యను కత్తిపీటతో నరికి.. భర్త ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 06/05/2020 12:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్యను కత్తిపీటతో నరికి.. భర్త ఆత్మహత్య


పాలకోడేరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మాగల్లులో దారుణం చోటుచేసుకుంది. మాగల్లు గ్రామానికి చెందిన కొరకూటి సత్యవతి(68)పై భర్త నాగేశ్వరరావు(70) కత్తిపీటతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి ఘటన తర్వాత  నాగేశ్వరరావు ఇంట్లోని కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతకొంతకాలంగా నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో మందులు వాడుతున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.  కూలి పనికి వెళ్లిన భార్య రాత్రి ఇంటికి తిరిగి రాగానే ఆమెతో ఘర్షణపడి  ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. భీమవరం గ్రామీణ సీఐ  శ్యామ్‌కుమార్‌, పాలకోడేరు ఎస్సై ఏజీఎస్‌ మూర్తి ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని