close

తాజా వార్తలు

Published : 28/02/2021 20:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ద్రోహం చేసినట్లే: హరీశ్‌

వికారాబాద్: తెరాస తరఫున హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబడిన సురభి వాణీదేవి అభ్యర్థిత్వంతోనే తెరాస గెలుపు ఖాయమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వికారాబాద్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు.  తెలంగాణ పథకాలను దిల్లీలోని కేంద్ర మంత్రులే ప్రశంసిస్తుంటే.. గల్లీలోని భాజపా లీడర్లు మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసి రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు కూడా తీసేయాలని భాజపా చూస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకొంటున్న కొంత మంది భాజపా నేతలు.. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. 

పార్టీ కన్నతల్లి లాంటిదని.. నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే తల్లికి ద్రోహం చేసినట్లే అవుతుందని హరీశ్‌ వ్యాఖ్యానించారు. ఎంతో మంది పట్టభద్రులను తయారు చేసిన ఘనత తెరాస అభ్యర్థి వాణీదేవిదని.. ఆమె మాజీ ప్రధాని కూతురైనప్పటికీ సాధారణ జీవితం గడిపారని చెప్పారు.  ఒకటి, రెండు స్థానాల్లో తెరాస ఓడిపోవడంతో పార్టీ పని అయిపోయిందనేలా ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని