close

తాజా వార్తలు

Updated : 10/08/2020 21:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం

ఇంటర్నెట్‌ డెస్క్‌: బతికి ఉండగానే భార్యకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న భర్తలున్న రోజులివి. అలాంటిది ఒక భర్త కుటుంబాన్ని విడిచి పరలోకాలకు వెళ్లిపోయిన భార్యకు ఏకంగా మైనపు విగ్రహం చేయించారు. ఈ ఘటన కర్ణాకటలో జరిగింది. రాష్ట్రంలోని కొప్పల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ గుప్తా తన భార్యకు విగ్రహం చేయించారు. ఈ విగ్రహం వెనుక కథేంటంటే...

శ్రీనివాస్‌ గుప్తా భార్య కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇటీవల శ్రీనివాస్‌ గుప్తా గృహ ప్రవేశం చేశారు. ఈ వేడుకలో తన భార్య లేని లోటు తెలియకూడదని ఆమె మైనపు విగ్రహం చేయించి... ఇంట్లో ఉంచారు. ఆ విగ్రహంతో కుటుంబ సభ్యులు ఫొటోలు దిగి మురిసిపోయారు. దిగువ ఫొటో అందులో ఒకటి. 

రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే... నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే చేయించాడు. జీవ కళ ఉట్టిపడుతున్న ఆ విగ్రహం గురించి ఎవరైనా చెప్తే గానీ తెలిసేలా లేదు. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో కదా.




Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.