మేడారం మహాజాతర తేదీలు ఖరారు
close

తాజా వార్తలు

Published : 25/04/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేడారం మహాజాతర తేదీలు ఖరారు

తాడ్వాయి: ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. మాఘమాసంలో నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సమ్మక్క-సారలమ్మ మహాజాతరను నిర్వహిస్తారు. 2022లో జరగనున్న మేడారం మహాజాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు.

2022లో జరిగే జాతర తేదీలివే..

ఫిబ్రవరి 16 - సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకొస్తారు.
ఫిబ్రవరి 17 - చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు.
ఫిబ్రవరి 18 - సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకోవడం.
ఫిబ్రవరి 19 - వన ప్రవేశం, మహా జాతర ముగింపు.

దర్శనాలు నిలిపివేత..

మరోవైపు తెలంగాణలో కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా మేడారం పూజారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 1 నుంచి 15 వరకు మేడారం అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని