తెలంగాణ శిశువిహార్‌లో ఐసోలేషన్‌ కేంద్రం
close

తాజా వార్తలు

Published : 06/05/2021 23:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ శిశువిహార్‌లో ఐసోలేషన్‌ కేంద్రం

హైదరాబాద్: కొవిడ్ బారినపడ్డ చిన్నారులు, కరోనా నిర్ధారణ అయినవారి పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. కొవిడ్ బారినపడ్డ పిల్లలకు మెరుగైన చికిత్స అందించేందుకు దగ్గర్లోని ఆస్పత్రులు, శిశు కేంద్రాలకు తరలించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

కొవిడ్ బారినపడి ఒంటరి అవుతున్న చిన్నపిల్లలను పరిరక్షించేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్‌కు వస్తున్న కేసులను ఆమె పరిశీలించారు. చిన్నారులకు మెడికల్ కిట్స్‌ అందించాలని.. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో శిశువిహార్‌లోని పిల్లల ఆరోగ్య పరిస్థితులు, కరోనా నివారణ, చికిత్స కోసం కల్పిస్తున్న సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. శిశువిహార్‌లోని వార్డులను ఒక్కొక్కటిగా తిరిగి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కరోనా నేపథ్యంలో అక్కడి చిన్నారులకు అందిస్తున్న ఆహారాన్ని మంత్రి పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని