‘‘కరోనా కట్టడికి సీఎం చర్యలు తీసుకుంటున్నారు’’
close

తాజా వార్తలు

Published : 27/07/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘కరోనా కట్టడికి సీఎం చర్యలు తీసుకుంటున్నారు’’

తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

కామారెడ్డి: కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని, మంత్రి ఈటల రాజేందర్‌ నిత్యం వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో వైద్యాధికారులతో మంత్రులు ఈటల రాజేందర్‌, ప్రశాంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాకు 11 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఐదుగురు ఫార్మాసిస్టులు, 68 ఎంపీహెచ్‌ మహిళా సిబ్బందిని నియమించాలని ఈ సందర్భంగా మంత్రులను కలెక్టర్‌ కోరారు. జిల్లాలో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాతా శిశు సంరక్షణ ఆస్పత్రికి రూ. 5 కోట్లు ఇవ్వాలని కోరారు. ఇందుకు మంత్రులు సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి ఆస్పత్రిలో ఆక్సిజన్‌సౌకర్యం ఉందని, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు మరింత నిబద్ధతతో సేవ చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఎలాంటి సదుపాయాలైనా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని