close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120042903 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => b-ZgualC3ls [video_short_link] => b-ZgualC3ls [created_by] => 8925086 [created_date] => 2020-03-30 13:14:37.740882 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. భారత్‌లో కరోనా: 1071కేసులు, 29 మరణాలు

ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజృంభిస్తోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1071కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో 29మంది మరణించగా 942మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 100మంది కొవిడ్‌-19నుంచి కోలుకున్నారని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. లాక్‌డౌన్‌పై వదంతులు నిరాధారం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. ‘‘అలాంటి(లాక్‌డౌన్‌ పొడగింపు) ఊహాగానాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ పొడగించే యోచనేమీ లేదు’’ అని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా స్పష్టం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. 24 గంటల్లో 63వేల మందికి కరోనా..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో వైరస్‌ బారినపడ్డవారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. వీరిలో ముప్ఫై వేలకు పైగా మంది వైరస్‌తో పోరాడుతూ మృతిచెందారు. మరో లక్షా 50 వేల మంది వైరస్‌ను జయించి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 63,159 మంది  కొత్తవారిలోకి ఈ వైరస్‌ ప్రవేశించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆదివారం ఉదయం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కరోనా వైరస్‌ ఎలా వ్యాపిస్తుందో చూడండి

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనే వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇతర జబ్బులు(ఫ్లూ)లతో పోలిస్తే ఈ వైరస్‌ ఎంత వేగవంతంగా, ప్రమాదకరంగా సోకుతోందనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. చైనాలోని వూహాన్‌ ప్రావిన్స్‌లో తొలుత ప్రబలిన ఈ మహమ్మారి స్వల్ప కాలంలోనే ప్రపంచం నలుమూలలకు పాకింది.  వీడియో కోసం క్లిక్‌ చేయండి 

5. కడుపులో బిడ్డతో 100కిమీ నడక..!

దేశమంతా మూసివేత ఉత్తర్వులు అమల్లో ఉన్న నేపథ్యంలో... స్వగ్రామం చేరుకోవటం కోసం ఎనిమిది నెలల గర్భిణి తన భర్తతో కలసి ఆహారం కూడా లేకుండా కాలినడకన 100 కిలోమీటర్లు ప్రయాణించింది. దాదాపు అపస్మారక స్థితికి  చేరుకొన్న ఆమెకు పోలీసులు పరిచర్యలు చేసి, వారి గ్రామాన్ని చేరటానికి సహకరించటంతో కథ సుఖాంతమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కార్మికులకు ఉచితంగా మొబైల్‌ సర్వీసులు ఇవ్వండి 

వలస కార్మికులకు నెలరోజులపాటు ఉచితంగా మొబైల్‌ సర్వీసులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ  టెలికం సంస్థలను కోరారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ,  ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌  భారతీ మిట్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, వొడాఫోన్‌ల అధిపతులకు ఆమె వేర్వేరుగా లేఖలు రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కరోనాతో సంగీత గాయకుడు కన్నుమూత!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ సామాన్యుల నుంచి దేశాధ్యక్షుల వరకు ఎవర్నీ వదలడంలేదు. గ్రామీ పురస్కార గ్రహీత, అమెరికాకు చెందిన ప్రముఖ దేశీయ గాయకుడు జో డిఫ్ఫే కరోనా వైరస్‌తో మరణించాడు. కొవిడ్‌-19 కారణంగా ఆదింవారం నాడు జో మరణించాడని ఆయన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సమస్యలకు వాట్సాప్‌లో బదులిస్తున్న కంపెనీలు

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో, సేవా కేంద్రాలు (సర్వీస్‌ సెంటర్లు) మూసివేసిన నేపథ్యంలో, తమ కొనుగోలుదార్ల సందేహాలకు సామాజిక మాధ్యమాలు, ఇతర ఆన్‌లైన్‌ సాధనాల ద్వారా కంపెనీలు పరిష్కారాలు చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. సోనీ, శామ్‌సంగ్‌, పానసోనిక్‌, హైయర్‌, గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ వంటి కంపెనీలు వైవ్‌ఛాట్‌, వాట్సాప్‌, డీఐవై వీడియో వంటి మాధ్యమాలతో పాటు ఆన్‌ కాల్‌ అసిస్టెన్స్‌ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ఖాతాదార్లతో సంభాషిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

దేశీయ మార్కెట్లను కొవిడ్‌-19 భయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం 12.45కి గంటలకు సెన్సెక్స్‌ 824 పాయింట్లు నష్టపోయి 28991.45 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 224 పాయింట్లు దిగజారి 8436.40 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.49 వద్ద కొనసాగుతోంది. ఓ దశలో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా పడింది.

10. ఇంట్లోనే ఉండి ఇతరులకు సాయపడాలి: స్మిత



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.