రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి పీవీ కుమార్తె
close

తాజా వార్తలు

Published : 22/02/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి పీవీ కుమార్తె

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం 

హైదరాబాద్‌: రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ తెరాస.. పీవీ కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావుని గౌరవిస్తూ అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించడంలో అర్థం లేదన్నారు. పీవీపై నిజంగా అభిమానం ఉంటే ఆయన కూతురికి రాజ్యసభ సభ్యత్వం కానీ, గవర్నర్‌ కోటా నుంచి ఎమ్మెల్సీగా కానీ అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెరాస తరఫున పోటీ చేయడానికి ఎవరూ లేరని పొన్నం అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం పీవీ నరసింహరావు కుటుంబాన్ని వాడుకోవద్దని సూచించారు. గెలవలేని, బలం లేని ఎమ్మెల్సీ స్థానంలో అవకాశం ఇచ్చి ఆ కుటుంబాన్ని అవమాన పరిచే ప్రయత్నం చేయవద్దని పొన్నం విజ్ఞప్తి చేశారు. 
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని