చేప కడుపులో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ 
close

తాజా వార్తలు

Updated : 25/03/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేప కడుపులో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ 

బెంగళూరు: కర్ణాటకలో ఓ చేప కడుపులో పెద్ద ప్లాస్టిక్‌ బ్యాగ్‌ దొరికింది. సముద్రం అడుగు భాగంలోకి ప్లాస్టిక్‌ చేరటం వల్ల చేపలు మృత్యువాత పడుతున్నాయని మంగళూరు ఫిషరీస్‌ కాలేజీ డీన్‌ ఏ.సెంథిల్‌ వేల్‌ ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. పర్యావరణానికే కాదు.. సముద్ర జీవసంపదకు ప్లాస్టిక్‌ పెనుభూతంగా మారిందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. మంగళూరులో ఓ చేపల మార్కెట్‌లో రీఫ్‌ క్వాడ్‌(మురు) అనే చేపను కట్‌ చేస్తుండగా దాని కడుపులో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ బయటపడింది.  ఏ.సెంథిల్‌ వేల్‌ ఈటీవీ భారత్‌తో మాట్లాడుతూ.. జాలర్లు వేటకు వెళ్లినప్పుడు వారి వలలో 40 శాతం ప్లాస్టిక్‌ లభ్యమవుతోందని తెలిపారు. కాలుష్యం వల్ల సముద్ర జీవులకు హాని కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని