రావణ పాత్రధారి బతికే ఉన్నారు
close

తాజా వార్తలు

Published : 06/05/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రావణ పాత్రధారి బతికే ఉన్నారు

ఫొటో షేర్‌ చేసిన నటుడు సునీల్‌

ముంబయి: ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్‌’. 1980లో ప్రసారమైన ఈ ధారావాహికతో రావణుడిగా ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు అరవింద్‌ త్రివేది. కాగా, అరవింద్‌ త్రివేది ఆరోగ్య పరిస్థితి గురించి ఇటీవల ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ఆయన కొవిడ్‌తో మృతి చెందారని గత కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై రామాయణ్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్‌ లహ్రీ స్పందించారు. అరవింద్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని సూచించారు.

అరవింద్‌తో దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఎక్కువగా ఫేక్‌ న్యూస్‌ వినాల్సి వస్తోంది. అరవింద్‌ త్రివేది మృతి చెందారని వస్తోన్న పుకార్లు తాజాగా మా దృష్టికి వచ్చాయి. ఈ విధమైన వదంతులను వ్యాప్తి చేస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. దయచేసి ఇలాంటి వాటిని ఇకనైనా ఆపండి. దేవుడి దయవల్ల అరవింద్‌ జీ ఆరోగ్యంగానే ఉన్నారు’ అని సునీల్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని