యాక్షన్‌ అడ్వంచర్‌ కథాంశంతో రానా
close

తాజా వార్తలు

Updated : 01/09/2020 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాక్షన్‌ అడ్వంచర్‌ కథాంశంతో రానా

హైదరాబాద్‌: వైవిధ్యభరిత కథా చిత్రాల్ని ప్రేక్షకులకు చూపించేందుకు ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తుంటారు కథానాయకుడు రానా. ఈ క్రమంలోనే ఇప్పుడాయన మరో కొత్త కథకు పచ్చజెండా ఊపారు. ‘గృహం’ చిత్రంతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు మిళింద్‌ రావ్‌తో ఈ సినిమా చేయబోతున్నారు. దీన్ని ఆచంట గోపీ నాథ్‌తో కలిసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించబోతుంది.

ఓ సరికొత్త సూపర్‌ నేచురల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం రానా కథానాయకుడిగా నటిస్తోన్న ‘విరాటపర్వం’ తుది దశ చిత్రీకరణలో ఉండగా.. ఇప్పటికే పూర్తయిన ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని