Corona: మరో నాయకుడిని కోల్పోయిన కాంగ్రెస్‌
close

తాజా వార్తలు

Published : 28/04/2021 14:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: మరో నాయకుడిని కోల్పోయిన కాంగ్రెస్‌

ముంబయి: కరోనా మహమ్మారి కారణంగా కాంగ్రెస్‌ పార్టీ మరో సీనియర్‌ నేతను కోల్పోయింది. కొవిడ్‌ సోకడంతో మహారాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. 81ఏళ్ల గైక్వాడ్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన కుమార్తె వర్ష గైక్వాడ్‌ ప్రస్తుతం మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 

గైక్వాడ్‌ మరణ వార్త కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘తండ్రి లాంటి వ్యక్తి, మార్గదర్శకుడిని కోల్పోయాను’ అంటూ మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సచిన్‌ సావంత్‌ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, పలువురు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. 

1985 నుంచి ధారవి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ రాష్ట్ర కేబినెట్‌లో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. 2004లో ముంబయి సౌత్‌ సెంట్రల్‌ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన.. గతంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. కాగా.. కాంగ్రెస్‌ మరో సీనియర్‌ నాయకుడు ఎం. సత్యనారాయణ రావు నిన్న కరోనాతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని