ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా
close

తాజా వార్తలు

Published : 16/02/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా

వెంకటాచలం: సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో చోటుచేసుకుంది. వికలాంగుల కాలనీ, భగత్‌సింగ్‌ కాలనీలో నివాసం ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న అలీం(13), వెంకటసాయి(13), రాజేష్(13) స్నేహితులు. ఆదివారం సెలవు కావడంతో ముగ్గురు సరదాగా చెముడుగుంట చెరువులో ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు పిల్లలు చెరువులో గల్లంతయ్యారు. ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. పిల్లల సైకిళ్లు, దుస్తులు చెరువు గట్టుపై చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి వీలు కాకపోవడంతో ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. 

పిల్లల విగతజీవులుగా చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి..

బాధిత కుటుంబాలకు పరామర్శ

టూల్‌కిట్‌ కేసు: మరో ఇద్దరిపై అరెస్టు వారెంటు!
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని