ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణహత్య
close

తాజా వార్తలు

Updated : 27/04/2021 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణహత్య

ప్రొద్దుటూరు (నేరవార్తలు): కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. సొంత కుమారుడే తల్లితో పాటు చెల్లి, తమ్ముడిని చంపేశాడు. తన వివాదం విషయంలో కుటుంబ సభ్యులు సహకరించడం లేదన్న కారణంతో ముగ్గురిని అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని హైదర్‌ఖాన్ వీధిలో ఈ ఘటన జరిగింది. 

ఇంటి పెద్ద కుమారుడు కరీముల్లాకు తన భార్యతో వివాదం ఉంది. ఈ విషయంలో తల్లి, చెల్లి, తమ్ముడు సహకరించాలంటూ కొద్ది రోజులుగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున తల్లి ఇంటికి వచ్చిన కరీముల్లా.. నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాలను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. అనంతరం తెల్లవారుజామున కరీముల్లా నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని