close

తాజా వార్తలు

Published : 28/02/2021 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పోస్కోతో పుట్టి ముంచేలా!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమం ఉద్ధృతమవుతోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఒకవేళ ప్రైవేటీకరణ వాయిదా వేస్తే దక్షిణ కొరియా ఉక్కు తయారీ సంస్థ పోస్కోతో విశాఖ ఉక్కు సంస్థ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) చేసుకున్న ఒప్పందం మళ్లీ తెరపైకి రానున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలోని పలు నిబంధనలు ఉక్కు కర్మాగారం పుట్టి ముంచేలా ఉన్నాయని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒప్పందంలోని అంశాలివీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పైసల్లేవు..పనులూ లేవు!

2. సెగ మొదలైంది

మొన్నటి వరకూ చలి.. ఉదయం పది గంటల వరకు మంచు.. వారంలోనే వాతావరణం మారిపోయింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి. సాధారణం కంటే 3.6 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 20తో పోలిస్తే.. తునిలో 8 డిగ్రీలకు పైగా పెరుగుదల నమోదైంది. గరిష్ఠంగా కృష్ణా జిల్లా నందిగామలో 39 డిగ్రీలు, అనంతపురంలో 38.6, కర్నూలులో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొవిడ్‌ నుంచి కాపాడే...వారసత్వ ప్రొటీన్‌!

అదో గమ్మత్తయిన ప్రొటీన్‌! నియార్తండల్‌ జాతి ఆది మానవుల నుంచి పారంపర్యంగా వస్తోన్న మాంసకృత్తు. దానిపేరు ‘ఓఏఎస్‌1’. రక్తంలో ఈ ప్రొటీన్‌ ఉన్నవారికి కొవిడ్‌ తీవ్రత చాలా తక్కువగా ఉంటున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, మరణ ముప్పు కూడా వారికి తక్కువేనని రూఢి అయింది. కెనడాలోని లేడి డెవిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం సాగించారు. ఇందులో భాగంగా 14,134 కొవిడ్‌ కేసులను వారు విశ్లేషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా?!

4. నేను వాళ్ల రోల్‌మోడల్‌గా ఉండాలనుకున్నా!

‘పెళ్లంటే ఒకరి బాధ్యతల్ని మరొకరు ఇష్టంగామోయడం... మా అమ్మానాన్నలు ఆ పనిని ఎంతో ఇష్టంగా చేశారు..’ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఆయన భార్య లత నలభయ్యో పెళ్లిరోజుని ఉద్దేశించి కూతురు ఐశ్వర్య చేసిన ట్వీట్‌ ఇది. దేశం మెచ్చిన నటుడు రజనీ ఎదుగుదలలో లత పాత్ర చిన్నదేం కాదు.. ముఖ్యంగా పిల్లల విషయంలో పూర్తిగా బాధ్యతలు తలకెత్తుకున్నారు. వివిధ సందర్భాల్లో పిల్లల పెంపకం గురించి లత చెప్పిన విషయాలివి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భోజనం భారత్‌లో... పడక మయన్మార్‌లో..!

నాగాలాండ్‌ రాష్ట్రం, మన్‌ జిల్లాలోని లొంగ్వా గ్రామ పెద్ద ఒకేసారి రెండు దేశాల్లో ఉండగలడట. ఆయన రోజూ భోజనం భారత్‌లో చేస్తాడు. నిమిషంలోనే మయన్మార్‌ దేశానికి వెళ్లి నిద్రపోతాడు. ‘ఆయనకు ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమయ్యే శక్తి ఏమైనా ఉందా...’ అనుకుంటున్నారా... అదేం లేదు. అసలు విషయం ఏంటంటే లోక్‌నంగ్‌ అనే ఈయన ఇంటి మధ్యలోంచి భారత్‌, మయన్మార్‌ సరిహద్దు గీత వెళ్లిందట. అందుకే, ఆయన ఇంట్లోని వంటగది భారత్‌లో ఉంటే పడకగది మయన్మార్‌కి చెందుతుంది. ఆ ఊరు కూడా రెండు దేశాల కిందికి వస్తుంది. అందుకే, ఇక్కడి కొణ్యక్‌ గిరిజనులకు రెండు దేశాల పౌరసత్వమూ ఉంటుందట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. థార్‌ ఎడారిలో బాలాకోట్‌ తరహా దాడి

బాలాకోట్‌ వైమానిక దాడికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వాయుసేన ఘనంగా వేడుకలను నిర్వహించింది. నాటి దాడుల్లో పాల్గొన్న స్క్వాడ్రన్‌.. థార్‌ ఎడారిలో స్పైస్‌ 2000 బాంబులతో ఒక సాధన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం.. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి చొచ్చుకొని వెళ్లి.. అక్కడి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. బాలాకోట్‌ దాడి వేడుకల్లో శనివారం భారత వాయుసేన అధిపతి భధౌరియా ఆధునికీకరించిన మిరేజ్‌-2000ని నడిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* జట్టుపట్టి లాగారు...తీవ్రంగా కొట్టారు

7. క్యూఆర్‌ కోడ్‌తో కరెంటు బిల్లుల చెల్లింపు

 రాష్ట్రంలో విద్యుత్తు బిల్లుల చెల్లింపు మరింత సులభతరం కాబోతోంది. త్వరలో క్యూఆర్‌(క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌తో విద్యుత్తు బిల్లులు రాబోతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ఇటీవలే దీనిపై ప్రాథమిక నిర్ణయం తీసుకొంది. అధికారులు కొద్దిరోజులుగా ఈ బిల్లుల జారీపై కసరత్తు చేస్తున్నారు. సాంకేతికత సిద్ధం కాగానే తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎస్‌ ఈఆర్‌సీ) అనుమతి పొందాక ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తను ఛిద్రమైనా... బిడ్డ భద్రం

ఆ లారీ వేగంగా మృత్యువులా ముంచుకొస్తోంది... రోడ్డుపై పడి ఉన్న తల్లి, ఆమె పక్కనే ఏడాది బాబు... ఒక్క క్షణం ఆలస్యమైనా తనతో పాటు పసివాడికీ ప్రమాదం తప్పదు... ఆ అమ్మ వెనుకాముందూ చూడలేదు... తను చనిపోయినా బిడ్డ బతికితే చాలనుకున్నారు. శక్తినంతా కూడగట్టుకుని పసివాడిని పక్కకు విసిరారు. అంతలోనే లారీ ఆమె తలను ఛిద్రం చేస్తూ వెళ్లింది... ఆ పక్కనే పడిన బాబు ప్రాణాలు నిలిచి... భద్రంగా ఉన్నాడు... అమ్మ ప్రేమకు ఏదీ సాటి రాదని రుజువు చేసింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అక్కడా తెలుగులోనే మాట్లాడతా

నాతోనే నాకు పోటీ అంటోంది కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. వాణిజ్య ప్రధానంగా సాగే చిత్రాలైనా... నటనకి ప్రాధాన్యమున్న పాత్రలైనా వాటిపై తనదైన ముద్ర వేసే నాయిక రకుల్‌. దక్షిణాదిలో అగ్ర తారగా గుర్తింపుని సొంతం చేసుకున్న ఈమె,  హిందీలోనూ ఐదు సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల నితిన్‌తో కలిసి ‘చెక్‌’లో నటించింది రకుల్‌. అందులో చేసిన న్యాయవాది మానస పాత్ర,  తన  సినీ ప్రయాణం గురించి ఆమె  శనివారం ముంబయి నుంచి  విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సీతయ్య సంతోషం.. జామ చెట్ల ఆనందం

10. మంచి పిచ్‌ అంటే ఏంటి?

 భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు కోపమొచ్చింది. మొతేరాలో స్పిన్‌కు దాసోహమన్న పిచ్‌ మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఓ బ్రిటిష్‌ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు అతను తనదైన శైలిలో జవాబిచ్చాడు. మొతేరా పిచ్‌ టెస్టు మ్యాచ్‌కు సరిపోయే పిచ్‌యేనా అంటూ అశ్విన్‌ను వర్చువల్‌ విలేకరుల సమావేశంలో ఓ బ్రిటిష్‌ జర్నలిస్టు ప్రశ్నించాడు. దీనికి అశ్విన్‌ బదులిస్తూ.. ‘‘అసలు మంచి పిచ్‌ ఏంటి మీ ఉద్దేశంలో ఏంటో చెప్పండి. దాన్ని ఎవరు నిర్వచిస్తారు. తొలి రోజు పేసర్లకు సహకరించి, తర్వాత బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించి.. చివర్లో స్పిన్నర్లు ఆధిపత్యం చలాయిస్తే అది మంచి వికెటా?’’ అని అశ్విన్‌ ప్రశ్నించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని